నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్చదనం – పచ్చదనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బీ బ్లాకులో, స్వయం సహాయక సంఘాలతో కలసి, దోమలు నిర్మూలన, దోమలు వల్ల కలిగే వ్యాధులు గూర్చి, తడి, పొడి చెత్త గూర్చి చేపడుతున్న చర్యలు, ప్రజలు చేపట్టాల్సిన జాగ్రత్తలు గూర్చి, స్థానిక ప్రజలతో కలసి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసారు.
స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని, అధికారులకు సహాయ సహకారాలు అందించి, కార్యక్రమ స్ఫూర్తిని విజయవంతం చెయ్యాలని విచ్చేసిన జీహెచ్ఏంసీ అధికారులు స్థానిక ప్రజలను కోరారు. ఈ స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమంలో పిఓ నాగ మల్లేశ్వరి, సీఓ పద్మ, రమా, ఆర్పీ రూప రెడ్డి, కళ్యాణి, శానిటేషన్ ఇంచార్జి రాజయ్య, ఏంటోమాలజీ సూపర్ వైజర్ అబ్దుల్ సత్తార్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.