- జోన్ వ్యాప్తంగా ప్రారంభమైన స్వచ్చదనం- పచ్చదనం
- ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమం సోమవారం ప్రారంభమైనట్లు జోనల్ కమీషనర్ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 9 వరకు కొనసాగే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని స్వచ్ఛ పరిసరాలను నెలకొల్పుకునేందుకు కృషి చేయాలని కోరారు.
తొలి రోజు స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం జడ్సీ ఉపేందర్‌రెడ్డి శేరిలింగంపల్లి సర్కిల్‌లో ఎమ్మెల్యే గాంధీ సహా అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం తన కార్యాలయంలో ఈ కార్యక్రమ నిర్వహణపై అధికారులతో ఫోనులో సమీక్షించారు. ఈ సందర్భంగా జడ్సీ మాట్లాడుతూ జోన్ వ్యాప్తంగా శేరిలింగంపల్లి, చందానగర్, యూసుఫ్‌గూడ, ఆర్‌సీపూర్‌పటాన్‌చెరు సర్కిళ్లలోఓ తొలి రోజు 9135 మొక్కలను కాలనీలలో పంపిణీ చేసినట్లు తెలిపారు. రహదారుల శుభ్రంతో పాటు కాలనీలలో పేరుకున్న టన్నుల వ్యర్థాల తొలగింపు, నిర్మాణ వ్యర్థాలు 193 టన్నుల మేర తొలగించామన్నారు. ఆయా సర్కిళ్ల పరిధిలోని 6 శ్మశాన వాటికలలో పరిశుభ్రత చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. జోన్ వ్యాప్తంగా 8309 ఇండ్లను సందర్శించి దోమల నివారణ చర్యలు చేపట్టినట్లు, 46 చెరువులు కుంటలలో ఫాగింగ్ చేయించామని, 17 కమ్యూనిటీ హాళ్లను తనిఖీ చేసి వాటిల్లో పరిశుభ్రత చర్యలు నిర్వహించినట్లు జోనల్ కమీషనర్ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. 24 కాలనీలను సందర్శించి ప్రజలతో అవగాహన కార్యక్రమాలు ప్రజారోగ్యం పట్ల తీసుకోవాలని జాగ్రత్తలను వివరించినట్లు జడ్‌సీ తెలిపారు. తొలి రోజు జోన్ వ్యాప్తంగా ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు స్వచ్చందంగా ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారని తెలిపారు. మరో నాలుగు రోజుల పాటు జరిగే స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జోనల్ కమీషనర్ ఉపేందర్‌రెడ్డి కోరారు.