- బిఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు, ఉద్యమ నేత రవీందర్ యాదవ్ హెచ్చరిక
నమస్తే శేరిలింగంపల్లి: అసెంబ్లీ సాక్షిగా అసభ్య పదజాలం వాడిన ఎమ్మెల్యే పైన స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు ఉద్యమ నేత రవీందర్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గుండా గిరి మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు.
దానం నాగేందర్ అసెంబ్లీలో మాట్లాడుతూ బి ఆర్ ఎస్ శాసనసభ్యులను బయట తిరగనియ్యనంటూ సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడడం గమనార్హం..( నీ అమ్మ, తోలు తీస్తా, బయట తిరగనియ్య అంటూ బెదిరింపు) లకు పాల్పడుతున్నారని, వాళ్ళ బెదిరింపులకు బయపడేవాళ్ళు ఎవరు లేరని తెలంగాణ ఉద్యమంలో లాఠీలకు, తూటాలకు బెదరని వాళ్ళం.. ఇప్పుడు ఉగాదింపుడు మాటలు మాట్లాడితే ఇక్కడ భయపడేది ఎవరూ లేరని తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు రవీందర్ యాదవ్ హెచ్చరించారు. ఇలాంటి దృశ్చర్య మాటలు మాట్లాడితే మరో తెలంగాణ ఉద్యమ కెరటం తెరలేపినట్లు అవుతుందని, తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని, దానం నోరు అదుపులో పెట్టుకోవాలని రవీందర్ యాదవ్ హెచ్చరించారు.