- శేరిలింగంపల్లిలో బీజేపీ శ్రేణుల ర్యాలీలు, బాణసంచా చప్పుళ్లు
- స్వీట్లు తినిపించుకున్న నేతలు, కార్యకర్తలు
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడంపై ఆ పార్టీ శేరిలింగంపల్లి నాయకులు చందానగర్‌లో సంబురాలు జరుపుకున్నారు. ర్యాలీ నిర్వహించి టపాసులు కాల్చారు. అనంతరం స్వీట్లు తినిపించుకున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దుబ్బాక ఫలితమే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతుందని అన్నారు. 2023లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కసిరెడ్డి భాస్కరరెడ్డి, పోరెడ్డి బుచ్చిరెడ్డి, గొల్లపల్లి రాంరెడ్డి, నాగం రాజశేఖర్, నూనె సురేందర్, రాకేష్ దూబే, వేణుగోపాల్, శ్రీనివాస్, గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, స్వాతి, శ్రీవాణి, లలిత, నిషాత్, సురేష్, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
వివేకానందనగర్‌లో…
దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించడంపై ఆ పార్టీ వివేకానందనగర్ డివిజన్ నాయకులు ఉప్పల ఏకాంత గౌడ్, నామాల శ్రీనివాస్ శంకర్ లు సంబురాలు నిర్వహించారు. బీజేపీ కార్యకర్తలతో కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బాణసంచా కాల్చారు. స్వీట్లు తినిపించుకున్నారు. అలాగే వివేకానంద నగర్ డివిజన్ రిక్షా పుల్లర్ కాలనీలో బిజెపి కార్యకర్తలు నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో బీజేపీ నాయకుడు ఉప్పల ఏకాంత గౌడ్ పాల్గొన్నారు.
కొండాపూర్‌లో…
దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించడంపై కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ చౌరస్తా వద్ద ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు బాల్ద అశోక్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. బాణసంచా కాల్చి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నీలం జయరాములు, ఓం ప్రకాష్, నర్సింగ్, మల్లేష్ ముదిరాజ్, నరేష్ ముదిరాజ్, కృష్ణ మూర్తి, వినీతా సింగ్ పాల్గొన్నారు.
ఎంఐజీలో…
ఎంఐజీ సెంటర్ లో బిజెపి రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి తోపుగొండా మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. స్థానిక బిజెపి నాయకులు బాణాసంచా పేల్చి పరస్పరం మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నాయకులు స్వాతి, జగదీశ్ కుమార్, డల్లె, శివకుమార్, అనిల్, సుధాకర్ పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శులు ప్రశాంత్ చారి, చిట్టా రెడ్డి ప్రసాద్ ల ఆధ్వర్యంలో తారా నగర్ నుంచి లింగంపల్లి గ్రామం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మిఠాయిలు పంచిపెడుతూ, బాణసంచా కాలుస్తూ బారి ఎత్తున సంబరాలు చేసుకున్నారు. డప్పుల దరువుల నడుమ నృత్యాలు చేస్తూ ముందుకు కదిలారు. శేరిలింగంపల్లి నియోజక వర్గ కన్వీనర్ బుచ్చిరెడ్డి, సీనియర్ నాయకులు చింతకింది గోవర్ధన్ గౌడ్, నిరటి చంద్రమోహన్, మారం వెంకట్, శాంతి బుషన్ రెడ్డి, శివకుమార్ గారు, కుమార్ యాదవ్, బాలరాజు, శ్రావణ్ పాండే, మనోజ్ ముదిరాజ్, అశోక్ నాయక్, కార్యకర్తలు, పార్టీ అభిమానులు బారీ ఎత్తున పాల్గొన్నారు.
Jai Bharat Jai jai bharat … BJP విజయం తెరాస కు పెద్ద దెబ్బ … రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం