ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని తులసి నగర్ వాంబే గృహ సముదాయంలోని 900 గృహాల నల్లా కనెక్షన్ లకు గాను HMWS బోర్డ్ నిధుల నుంచి రూ .6 లక్షల 50 వేల అంచనా వ్యయంతో చేపట్టనున్న మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, జలమండలి అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన మంచి నీరు అందించడం జరుగుతుందన్నారు. మంచి నీటి సమస్య తలెత్తకుండా పవర్ బోర్ల ద్వారా కూడా నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో 18 రిజర్వాయర్ లు నిర్మాణం అయ్యాయని, ప్రజల దాహార్తిని తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం వెంకటేశ్వర్లు, డివిజన్ తెరాస అధ్యక్షుడు జిల్లా గణేష్, తెరాస నాయకులు రామకృష్ణ గౌడ్, కాశీనాథ్ యాదవ్, చిన్నోళ్ల శ్రీనివాస్, సంతోష్ రావు, అనిల్ రెడ్డి, రాజేష్ చంద్ర, రామకృష్ణ, శ్రీనివాస్, హనుమంత రావు, కుమారి, స్థానికులు పాల్గొన్నారు.





