శిష్టకరణ సామాజిక వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చేవరకు పోరాటం

  • శిష్టకరణ జాతీయ ఓబీసీ సాధన కమిటీ కన్వీనర్ డీవీ కృష్ణారావు
  • ఘనంగా శిష్టకరణ సంక్షేమ సంఘం హైదరాబాద్ దశ వసంతోత్సవ వేడుకలు
  • వ్యవస్ధాపక సభ్యులకు ఘన సన్మానం

చందాన‌గ‌ర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా అన్నింటా వెనుకబడిన శిష్టకరణ సామాజిక వర్గానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనందించాలని శిష్టకరణ జాతీయ ఓబీసీ సాధన కమిటీ కన్వీనర్ డీవీ కృష్ణారావు కోరారు. శిష్టకరణ సంక్షేమ సంఘం హైదరాబాద్ దశ వసంతోత్సవ వేడుకలలో భాగంగా వ్యవస్ధాపక నాయకులకు ఘన సత్కార కార్యక్రమాలను చందానగర్ ఫ్రెండ్స్ కాలనీలోని సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కరోనా క్లిష్ట సమయంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మౌనం పాటించి వారికి నివాళులు అర్పించారు. అనంతరం శిష్టకరణ సంక్షేమ సంఘం హైదరాబాద్ ఆరవ నూతన కమిటీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీ కార్యవర్గాన్ని సభాముఖంగా ప్రకటించారు. అనంతరం వ్యవస్ధాపక సభ్యులు, శిష్టకరణ జాతీయ ఓబీసీ సాధన కమిటీ కన్వీనర్ డీవీ కృష్ణారావు, అయ్యన్నమహంతి రామకృష్ణారావు, సదాశివుని వెంకటేశ్వరరావు, కుప్పిలి హరగోపాల్ లను నూతన కార్యవర్గం తరపున ఘనంగా సత్కరించారు.

కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న శిష్టకరణ జాతీయ ఓబీసీ సాధన కమిటీ కన్వీనర్ డీవీ కృష్ణారావు

ఈ సందర్భంగా డీవీ కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో ఓబీసీ సాధనే ధ్యేయంగా సం‌ఘ పెద్దలందరూ కలిసికట్టుగా ఎన్నో పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వ బీసీ కమిషన్ సిఫార్సుల మేరకు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు అందించటం జరిగిందన్నారు. ముఖ్యంగా నేషనల్ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారిని, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సీనియర్ సభ్యుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ ని నిరంతరంగా కలుస్తూ ఓబీసీ సాధనకు తమ వంతు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. అతి త్వరలోనే ఓబీసీ సాధన దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సంఘ అగ్రనాయకులు, సభ్యులు ఓబీసీ సాధన యజ్జానికి కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన పిలుపు నిచ్చారు.

వ్యవస్ధాపక సభ్యులను సన్మానించిన దృశ్యం

శిష్టకరణ సంక్షేమ సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గం ఇదే…

శిష్ట కరణం సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా డి.వి. కృష్ణారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎ.ఆర్.కె.రావు, ముఖ్య ఉపాధ్యక్షుడిగా ఎస్ వీ రావు, ఉపాధ్యక్షులుగా కె. హరగోపాల్, ఆర్.శేషగిరి రావు, జనరల్ సెక్రటరీగా బి. విజయ కుమార్, అదనపు జనరల్ సెక్రటరీలుగా డి.అనంతప్రసాద్, ఎం. నారాయణరావు, ఉమెన్ వింగ్ జాయింట్ సెక్రటరీగా ఎ.సత్యలక్ష్మీ, జాయింట్ సెక్రటరీలుగా పి.ప్రకాష్ రావు, బి.టి.రమేష్, కోశాధికారిగా యు. పార్వతీశం, జాయింట్ కోశాధికారిగా కె.సిహెచ్.ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కె. చాముండేశ్వరి, కె. శ్రీనివాస రావు, ఎ. హరికిశోర్, ప్రచారకార్యదర్శులుగా కె. వెంకటేశ్వరరావు, ఎం. జయశ్రీ, P.R.S.S.N మూర్తి, సాంస్కృతికకార్యదర్శులుగా టి.ప్రతాప్ రాజు, శంకర్ పట్నాయక్, సాంకేతిక సలహా కార్యదర్శులుగా డి.సంతోష్ కుమార్, సి.హెచ్.దుర్గా ప్రసాద్, విజయ్ పట్నాయక్, ముఖ్య సలహాదారుడిగా డి.పార్థసారధి, సలహాదారుగా బి.వెంకట రమణ, న్యాయ సలహాదారుడిగా పి.తిరుపతి రావు, కార్యవర్గ సభ్యులుగా కె.శేష రత్నం, ఆర్ ఆనంద్ రావు, దిలీప్ కుమార్, రబి కుమార్ పట్నాయక్ నియమితులయ్యారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here