- ముప్పా సుబ్బయ్య చిత్ర పటానికి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని నరేన్ గార్డెన్స్ లో నరెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ ముప్పా సుబ్బయ్య దశ దిన కర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ , శ్రేయభిలాషులతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, శ్రద్ధాంజలి ఘటించి, ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ సుబ్బయ్య లేని లోటు తీరనిదని, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు చెప్పారు. వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి ,బిల్డర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేశారని, ఎన్నో సేవ కార్యక్రమాలు చేపట్టారని, ఆయన సేవలు అమోఘమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, కె. వి ప్రసాదరావు, మోహనరావు, విద్యాసాగర్, చాపరాల శ్రీనివాసదాసు, చంద్రమౌళి, కోళ్లి వెంకటేశ్వర రావు, శ్రీనివాస్, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.