- మాతృశ్రీ నగర్ ప్లాట్ నెంబర్ 503 లో అక్రమ షెడ్డు నిర్మించారని శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు మిద్దెల మల్లారెడ్డి వెల్లడి
నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృశ్రీ నగర్ లోని ప్లాట్ నంబర్ 503లో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు మిద్దెల మల్లారెడ్డి తెలిపారు.
మాతృశ్రీ నగర్ లోని ప్లాట్ నంబర్ 503లో దాదాపు 800 గజాలలో భారీ షెడ్డు నిర్మించారని, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి దృష్టి సారించి ఆ కట్టడాన్ని తొలగించాలని కోరారు. సర్కిల్ 21 లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి అధికారులను హెచ్చరించి వెంటనే అక్రమ నిర్మాణాలను నిలిపివేసి ప్రభుత్వ ఖజానాను పెంచేలా చూడాలని కోరారు.