నమస్తే శేరిలింగంపల్లి : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కార్పోరేట్ పాఠశాలకు ధీటుగా పోటీ పడి చదవి మంచి ఫలితాలు సాధించాలని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సూచించారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని సురభి కాలనీలో ఎంపీపీఎస్ పాఠశాలలోని విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. అనంతరం ఎంపీపీఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మెటల్ ప్లే గ్రౌండ్ పరికరాలను ప్రారంభించారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ..నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా ఈ స్కూల్ నిర్మించామని, ప్రతి విద్యార్థి ఉన్నతమైన చదువులు చదివి, ఉన్నతమైన పదువులను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగాధర్ రావు, ఎంయూ దేవదాసు, ఎస్ఎంసీ ఛైర్మన్ బస్వరాజ్, వార్డ్ మెంబర్, అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్మన్ శ్రీకళ, గోపాల్ యాదవ్, ఉపాధ్యాయులు ఆశ్రఫ్, మల్లికాంబ, షఫీ, సబియా పాల్గొన్నారు.