జోనల్ కమిషనర్ ను కలిసి విన్నవించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉపేందర్ రెడ్డి ని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్బంగా పలు కాలనీలలో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అసంపూర్తిగా మిగిలిపోయిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. శేరిలింగంపల్లి డివిజన్ లో పలు అభివృద్ధి పనుల పై జోనల్ కమిషనర్ తో చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించారని, త్వరతగతిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్పొరేటర్ తో వెళ్లిన వారిలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, కృష్ణ రెడ్డి ఉన్నారు.