- అధికారులకు జోనల్ కమిషనర్ స్నేహ శబరిష్ ఆదేశం
- గచ్చిబౌలి డివిజన్ లో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి పాదయాత్ర
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ లో నెలకొన్న సమస్యలు, చేపట్టవలసిన అభివృద్ధిపనుల కోసం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ శభరీష్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గోపన్ పల్లి తాండ, గోపన్ పల్లి, రాజీవ్ నగర్లలో పర్యటించారు. బస్తీల్లో చేపట్టవలసిన సీసీ రోడ్లు, డ్రైనేజి పైప్ లైన్, వాటర్ పైప్ లైన్ల ఏర్పాటుకు కావాల్సిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆమె ఈ సందర్భంగా ఆదేశించారు.
అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు, పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. అనంతరం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ చెరువుల సుందరీకరణ, పార్క్ ల అభివృద్ధి చేపట్టాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యుూఎస్ డీజీఎం శరత్ కుమార్, ఈ ఈ. శ్రీనివాస్, డి ఈ. విశాలాక్షి, టౌన్ ప్లానింగ్ అధికారులు రవీందర్ రావు, రమేష్, హెచ్ఎండబ్ల్యుూఎస్ మేనేజర్ అభిషేక్ రెడ్డి, ఏఎంఓహెచ్ నగేష్ నాయక్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు, రాజు, రమేష్, నర్సింగ్ నాయక్, ప్రసాద్, మహేష్, గోవర్ధన్, శ్రీను పాల్గొన్నారు.