నమస్తే శేరిలింగంపల్లి: తండ్రి మందలించడంతో 13 ఏండ్ల చిన్నారి అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. 7వ తేదీన బానోత్ నరేష్ తన కూతురు వసంత (13) ను చదువుకోవాలని మందలించి అతడు పనికి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత వసంత తల్లి కూడా పనికి వెళ్ళిపోయింది. ఐతే పని నుంచి తిరిగి వచ్చిన రమేష్ కు తన కూతురు కనిపించకపోవడంతో ఆందోళన చెందాడు.
చుట్టూ పక్కల తెలిసిన వారు, బంధువుల వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. దీంతో మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.