నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ బరిలో తెలంగాణ హకీ అధ్యక్షుడు, చందానగర్ నివాసి కొండ విజయ్ కుమార్ దిగారు. ఈ మేరకు ఫతేమైదాన్ తెలంగాణ ఒలింపిక్ భవన్ లో ఎన్నికల అధికారికి కొండ విజయ్ కుమార్ నామినేషన్ ను అందజేశారు.
జూన్ 9న తెలంగాణ ఒలింపిక్ భవన్ లో ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ప్యానల్ నుండి పోటీ చేస్తున్నట్లు కొండ విజయ్ పేర్కొన్నారు. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా తనకు అవకాశం వస్తే తెలంగాణ రాష్ర్టంలో క్రీడల అభివృద్దికి తనదైన శైలిలో కృషి చేస్తానని తెలంగాణ హకీ అధ్యక్షుడు తెలిపారు.