- గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రత్యేక చర్చ
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి ఉద్యమకారుల ఐక్యవేదిక రెండవ సమావేశం ఆదివారం జరిగింది. చందానగర్‌లోని వేదిక కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఉద్యమకారులు పాల్గొని రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రత్యేకంగా చర్చించారు. గ్రేటర్ ఎన్నికల్లో అవకాశం ఉన్నచోట ఉద్యమకారులకు ప్రధాన్యం ఇచ్చేలా టీఆర్ఎస్ అధిష్టానాన్ని ఒప్పించెందుకు వ్యవహరించాల్సిన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అదేవిధంగా శేరిలింగంపల్లిలోని అన్ని డివిజన్లలోను టీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషిచేయాలని తీర్మాణం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఉద్యమకారుల ఐక్యవేదిక ప్రతినిధులు మల్లికార్జున శర్మ, మిద్దెల మల్లారెడ్డి, సంగారెడ్డి, కలివేముల వీరేశం గౌడ్, రవిందర్ యాదవ్, గణేష్‌రెడ్డి, లోకేష్, సత్యనారాయణ రెడ్డి, అనిల్, సలీమ్, అశోక్, రాజారాం, రాజుయాదవ్, రాము యాదవ్, రాజేందర్, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.






