నమస్తే శేరిలింగంపల్లి : ఆధునిక భారత నిర్మాత, మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్నెపల్లి సాంబశివరావు ఆధ్వర్యంలో మియాపూర్ డివిజన్ మయూరినగర్ వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేపట్టారు.
నియోజకవర్గ నాయకులు, డివిజన్ నాయకులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.