- పాల్గొని పూజలు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో శ్రీశ్రీశ్రీ మద్విరట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర ఆరాధన మహోత్సవం కనులవిందుగా జరిగింది. స్థానిక డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావుతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ గౌడ్, సందీప్ ముదిరాజ్, దండే శ్రీనివాస్, అనిల్ రెడ్డి, రమణ చారి, నర్సింహ చారి, గోపి చారి, కమ్మరి రామకృష్ణ చారి, రమేష్ చారి, వెంకట్ స్వామి, నవీన్ రెడ్డి, రాము, ఇస్మాయిల్ పాల్గొన్నారు.