చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం.. కార్యకర్తలకు అండగా ఉంటాం

  • శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్
  • బిఆర్ యస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు..సాదరంగా ఆహ్వానం

నమస్తే శేరిలింగంపల్లి: చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురస్తామని, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ మహిళ నాయకురాలు రామేశ్వరమ్మ, వెంకటేష్ గౌడ్, మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన (శ్రీనివాస్ రెడ్డి, రజిత, సంజీవ, నికిత, స్వాతి, దివ్య, సంగీత, మౌనిక, అనూష, లక్ష్మీ, ఈశ్వరమ్మ, సునీత, నారాయనమ్మ, లక్ష్మీ దేవి, శైలజ, మని శర్మ, వెంకట్ బాలు, లడ్డు, సాయి, వంశీ, సందీప్, శివ, తేజ, మహేముదేర్, గణేష్, సైదులు, మహేష్ ) కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదం ఈసారి బలంగా ఉందని, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని మెజార్టీ సాధిస్తుందని అన్నారు. ఎంపీ గెలిస్తే మరింత అభివృద్ధి చేసుకొనే అవకాశం ఉందని అన్నారు.

పార్టీలో చేరిన వారితో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో సిటీకి ఆనుకుని ఉన్న శేరిలింగంపల్లి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తామని అన్నారు. అందుకు కార్యకర్తలు సిఫాయిల్లా పనిచేయాలని కోరారు.

రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీని అందించడం ఖాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉరిటీ వెంకట్రావు, మల్లికార్జున్ యాదవ్, డి.రాజు, నర్సింహ, సంతోష్, మహేష్, యాదయ్య పాల్గొన్నారు..

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here