- ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మద్దతుకు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్, యూత్ కాలనీలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని, కాసానిని అఖండ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ కి కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలను ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేయలేదని ప్రజలకు వివరిస్తూ, మోసం చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని, ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటూ, కాపాడుకుంటూ వచ్చిన పార్టీ మన బీఆర్ఎస్ కు ఓటేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బస్తి కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేయోభిలాషులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.