- ఆశీర్వదించి అభినందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ కి చెందిన త్రివేణి హై స్కూల్ సత్తా చాటింది. ఆ పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా వారిని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పథకాలతో అభినందించి, ఆశీర్వదించారు.
మియాపూర్ త్రివేణి విద్యార్థులు 11 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. వారిలో టి. కీర్తిసాయి తేజస్వీ, జి. పూజ్య, ఆర్. దీక్షిత, కె. ప్రణవి, కె. అర్జునాదేవి, బి. శ్రీహిత, కె. కృతిక శ్రీ మహా, కె. శ్రీహర్షిణి, కె. లీలా సాయిచరణ్, కె. హిమేంద్రసాయి, కృష్ణ, ఎస్. వెంకట సాయి, తన్మయ్, కౌండిన్యలను అభినందనలు వెల్లువెత్తాయి. విద్యార్థులతో పాటు సీ.ఆర్.ఓ సాయినరసింహారావు, ప్రిన్సిపాల్ లక్ష్మి ప్రసన్న, హాస్టల్ ప్రిన్సిపాల్ జగదీశ్వర్ రావు గార్లను ఎమ్మెల్యే గాంధీ అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ 100 శాతం ఉత్తీర్ణత సాధించడం గొప్ప విషయమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రతి ఒక్కరు ఒక లక్ష్యం ఏర్పరచుకొని ఆ దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.