
చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆదేశాలతో చేపట్టిన పట్టభద్రుల ఓటరు నమోదు పత్రాలను శనివారం చందానగర్ డివిజన్ కార్పొరేటర్ నవత రెడ్డి ప్రభుత్వ విప్ గాంధీకి అందచేశారు. ఈ సందర్భంగా నవత రెడ్డి మాట్లాడుతూ డివిజన్లో 4327 మంది పట్టభద్రుల ఓటు నమోదు చేయించామన్నారు. ఓటరు నమోదు ప్రక్రియకు సహకరించిన నాయకులు రఘునాద్ రెడ్డి, రఘుపతి రెడ్డి, రాఘవేందర్ రావు, పర్నంది శ్రీకాంత్, డి.వెంకటేశం, గోవర్ధన్ రెడ్డి, తుడి ప్రవీణ్, గోపి కృష్ణ, శ్రీనివాస్ నాయక్, బిట్ల శ్రీకాంత్ రెడ్డి , గౌస్,బొబ్బ దామోదర్ రెడ్డి, రమణ కుమారి, రాధిక, చందర్ రావు, పోచయ్య, రామా రావు, మల్లికార్జున్ రావు, శివ రాం, ప్రమోద్, సలీం, ప్రకాష్, జహీర్, గౌస్, మొయిజ్, రమేష్, విజయ్, ధన్ రాజ్, శభనా లకు నవతా రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. పెద్ద ఎత్తున ఓటరు నమోదు చేయించిన కార్పొరేటర్ కు ప్రభుత్వ విప్ గాంధీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.





