ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రాంతానికి చెందిన యువతి వివాహానికి స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆర్ధిక హాహం అందజేశారు. స్థానికంగా నివాసం ఉండే షరీఫబీ మనుమరాలు వివాహం నిశ్చయమైంది.. యువతి తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందారు. కాగా విషయం తెలుసుకున్న కార్పోరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ శనివారం రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని షరీఫాబీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొడ్ల రామకృష్ణ గౌడ్, మున్నాభాయ్, గౌస్ భాయ్, కైసర్, బాబన్, వెంకట్ నాయక్, యాదగిరి, శ్రీనివాస్, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.