పార్టీ అప్పగించే పనులను నిబద్ధతతో పూర్తి చేస్తాం: మిరియాల రాఘవరావు

ఓటరు నమోదు పత్రాలను ప్రభుత్వ విప్ గాంధీకి అందజేస్తున్న మిరియాల రాఘవరావు, ప్రీతమ్ లు

చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం తమకు అప్పగించిన పనులను నిబద్ధతతో పూర్తిచేస్తామని శేరిలింగంపల్లి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మిరియాల రాఘవరావు, యువజన నాయకులు మిరియాల ప్రీతమ్ లు అన్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమం లో భాగంగా చేపట్టిన 737 ఓటరు నమోదు పత్రాలను శనివారం ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ వారు అందజేశారు. ఈ సందర్భంగా రాఘవరావు, ప్రీతమ్ లు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ప్రభుత్వ విప్ గాంధీల ఆదేశాలతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా పెద్ద ఎత్తున ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా గాంధీ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సునీత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here