నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ హాఫీజ్ పెట్ డివిజన్ జనప్రియ అపార్ట్మెంట్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి హాఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ ఇంటింటి ప్రచారం చేపట్టారు.
చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్.జి.రంజిత్ రెడ్డికి సంపూర్ణ మద్దతుగా నిలవాలని, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.