మహోన్నత ప్రజా పాలకుడు సీతారామ చంద్రుడు

  • గచ్చిబౌలి డివిజన్ లో ఘనంగా శ్రీరామనవమి
  • ముఖ్యఅతిథిగా పాల్గొని పూజలు చేసిన గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి పరిధిలోని మంజీర డైమండ్ హిట్స్, నవోదయ కాలని, నేతాజీ నగర్ కాలనీలో శ్రీ సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం వేడుకగా జరిగింది. ఈ ఉత్సవాల్లో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తదితర ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు ఆయనను శాలువతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.

శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ గంగాధర్, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు

ఈ సందర్బంగా ప్రజలందరికీ గంగాధర్ రెడ్డి శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి జీవితం ఆచరణీయమని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఆవిర్భవించిన అవతారమే శ్రీరామ అవతారం అని అన్నారు. శ్రీరాముడి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలన్నారు.శ్రీరామనవమి ప్రజలందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు. రాముడు చూపించిన ధర్మమార్గం వైపు మనల్ని నడిపిస్తూ కుటుంబం, సమాజం, దేశం పట్ల మన కర్తవ్యాలను, బాధ్యతలను గుర్తు చేసే ఉత్సవమని పేర్కొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంజీర డైమండ్ హిట్స్ కాలనీ వాసులు, నవోదయ కాలనీ వాసులు, నేతాజీ నగర్ కాలనీ కాలనీ వాసులు, భక్తులు, పిల్లలు, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, స్థానిక నేతలు, కార్యకర్తలు, పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

కుటుంబ సమేతంగా సీతారాములకు హారతి పడుతున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

గోపనపల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గోపనపల్లి గ్రామస్థులు, భక్తులు, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, స్థానిక నేతలు, కార్యకర్తలు, పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here