- ముక్తకంఠంతో నినదిస్తున్న శేరిలింగంపల్లి ప్రజలు
- గచ్చిబౌలి డివిజన్ లో ప్రచారం చేపట్టిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డి కి శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థికే ఓటు వేసి గెలిపిస్తామని ముక్తకంఠంతో చెబుతున్నారు. అయితే గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం గ్రామంలోని దర్గాలో ప్రార్ధనలు నిర్వహించి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ ప్రచారాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నర్సింగ్ రావు, నరందేర్ రెడ్డి, కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, రాములు గౌడ్, డివిజన్ అధ్యక్షులు భారత్ గౌడ్, పల్లపు సురేందర్, అభిషేక్ గౌడ్, నియోజకవర్గ నాయకులు, డివిజన్ నాయకులు, మైనారిటీ నాయకులు, మహిళల అధ్యక్షులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.