నమస్తే శేరిలింగంపల్లి : ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో మరో ఐదేళ్లు పరిపాలించాలనే సంకల్పంతో 14 ముఖ్యమైన అంశాలను పొందుపరిచి మరోసారి మోదీ దేశ ప్రజల హృదయాలను గెలుచుకోబోతున్నారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్ తమ లక్ష్యమని కమలనాధులు చెబుతున్నారని మసీద్ బండ కొండాపూర్ పార్టీ కార్యాలయంలో పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
పార్టీ అధిష్ఠానం ప్రవేశపెట్టిన సంకల్ప్ పత్ర మేనిఫెస్టో పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేనిఫెస్టోలో యువతకు సాధికారత, రైతు సంక్షేమానికి మోడీ సంకల్పం, మహిళల అభ్యున్నతి, విశ్వబంధు, సురక్షిత భారత్, సమృద్ది భారత్, గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఈజ్ ఆఫ్ ఫీలింగ్, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన, స్వస్థ భారత్, అత్యుత్తమ శిక్షణ, క్రీడా వికాసం, సంతులిత అభివృద్ధి, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్ వంటి అంశాలను పొందిపరిచినట్లు తెలిపారు. భారతదేశ ప్రజల మన్నలను పొందిన ఏకైక ప్రధానమంత్రిగా మోడీ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఇవన్నీ అమలులోకి రావాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించవలసిందిగా ఓటర్ మహాశయులను అభ్యర్థించారు.