- ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ పరిధి ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలోనీ శ్రీ శ్రీ శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయం, శ్రీ ప్రసన్నాంజనేయస్వామి, షిరిడి సాయిబాబా దేవాలయం ప్రాంగణములో అర్చకులకు, సిబ్బందికి వసతి గృహ సముదాయం, అన్నదాన ప్రసాద వితరణ కోసం, స్టోర్ రూమ్ కోసం నూతనంగా చేపట్టబోయే వసతి గృహ సముదాయం కోసం భూమి పూజ చేపట్టారు. ఈ పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ దేవాలయ ప్రాంగణంలో అర్చకులు, సిబ్బంది కోసం వసతి గృహం నిర్మించుకోవడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేయడం, వసతి గృహాన్ని నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ఆలయ కమిటీ సభ్యులకు తెలిపారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు క్రిష్ణారెడ్డి, యాదయ్య, వెంగల్ రెడ్డి, వెంకట రామిరెడ్డి, వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి, వెంకట్ యాదవ్ , నాగభూషణం, వెంకట్ రావు, కాశీనాథ్ యాదవ్, జోగిపేట్ భాస్కర్, చిన్నోళ్ల శ్రీనివాస్, రాజేష్ చంద్ర పాల్గొన్నారు.