కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా ప్రచారం ముమ్మరం

  • ప్రచార వాహనాలకు జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా.. గల్లీ, గల్లీ, వాడవాడల తిరిగి ప్రచారం ముమ్మరం చేస్తామని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వివేకానందఃనగర్ డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ నివాసం వద్ద ఎన్నికల ప్రచార వాహనాలను కార్పొరేటర్లు మాధవరం రంగారావు, నార్నే శ్రీనివాసరావుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

బీఆర్ఎస్ పార్టీ ప్రచార వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

కాసానిని అఖండ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ కి కానుకగా ఇద్దామని తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్దామని, అందరిని సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని, ప్రతి గడపగడపకి వెళ్లి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అడుగుదామని ఎమ్మెల్యే తెలిపారు. కేసీఆర్ బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారని, బీసీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ని నిలబెట్టడం జరిగిందన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి, సమిష్టి కృషితో పని చేద్దామని, అఖండ మెజారిటీతో కాసానిని గెలిపిద్దామని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు భిక్షపతి ముదిరాజు, సంతోష్ రావు, కాశీనాథ్ యాదవ్, చిన్నోళ్ల శ్రీనివాస్, రాజేష్ చంద్ర, రాము, జగన్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here