చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సబ్స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తారానగర్ ఏఈ రవిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ నిర్వహణ పనుల నిమిత్తం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంజినీర్స్ ఎన్క్లేవ్, హుడా, శాంతినగర్, ఇందిరానగర్, చందానగర్, లింగంపల్లి, మార్కెట్, తారానగర్, ఎస్ఎం లే అవుట్, ఓల్డ్ లింగంపల్లి, రైతు బజార్, లింగంపల్లి పోలీస్ స్టేషన్, హుడా ట్రేడ్ సెంటర్, రైల్ విహార్, శివాజీనగర్లలో కరెంటు ఉండదన్నారు.






