నమస్తే శేరిలింగంపల్లి : త్యాగం, దయ, సానుభూతి, క్రమశిక్షణ, దానాగుణాలను నేర్పే పవిత్ర రంజాన్ పండుగను శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ముస్లిం సోదర, సోదరీమణులు వేడుకగా జరపుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్వర్ షరీఫ్ నివాసానికి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు మహేందర్ ముదిరాజ్, నరేందర్ బల్లా, సందీప్ రెడ్డి పాల్గొన్నారు.