నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని తారానగర్, చందానగర్, హఫీజ్ పేట్ డివిజన్లలో పలుచోట్ల ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా వారి స్వగృహలకు వెళ్లి “రంజాన్ ఈద్ ముబారక్” శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి గచ్చిబౌలి విలేజ్ ప్రెసిడెంట్ సయ్యద్ నయీమ్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిధులుగా విచ్చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం నయీమ్ స్వగృహంలో ఏర్పాటుచేసిన విందులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ…పవిత్ర రంజాన్ పర్వదినాన్ని శాంతి, పరస్పర సహకారం, ఐక్యమత్యంతో జరుపుకోవాలని అన్నారు. ఆ అల్లా అనుగ్రహంతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని కార్పొరేటర్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, సీనియర్ నాయకులు మిరియాల రాఘవ రావు, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్, త్రినాథ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు.