నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా చేపట్టిన ఒడిసి మొహినియాట్టం నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.
నిర్మల్య డాన్స్ స్కూల్ గురు దేబస్రి పట్నాయక్ శిష్య బృందం ఒడిసి నృత్య ప్రదర్శనలో బట్టు నృత్య, పల్లవి, మోక్ష, మొదలైన అంశాలను అన్సీ, శార్వరి, నందు, నేహా, అనూష, శాంభవి, టియా, రోహిణి మొదలైన వారు ప్రదర్శించారు.
తదుపరి నృత్యంశంలో డాక్టర్ మైథిలి అనూప్ శిష్య బృందం మొహినియాట్టం నృత్య ప్రదర్శనలో శ్లోకాలు, నవరసాంజలి, జతిస్వరం, కీర్తనం, తిల్లాన అంశాలను వీణ, ఉన్నతి, సంగీత, పార్వతి తనిష్క, ప్రీతీ , అనఘా , జాహ్నవి, శ్రీహిత మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు. ప్రముఖ పాత్రికేయురాలు లక్ష్మి రామకృష్ణ విచ్చేసి కళాకారులను అభినందించారు.