నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీల గార్డెన్ కాలనీలోని పలు సమస్యల పరిష్కారానికి, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై కాలనీ వాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేపట్టారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ శ్రీల గార్డెన్ కాలనీలో పలు సమస్యలను పరిశీలించామని, కాలనీలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, కాలనీలలో పెండిగ్ లో వున్న యూజిడి లైన్, పార్క్ అభివృద్ధి పనులు, సీసీ రోడ్ల పనులను త్వరలోనే ప్రారంభిస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన సౌకర్యాలు కలిపిస్తామని పేర్కొన్నారు. మియాపూర్ డివిజన్ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఫణి కుమార్, చంద్రిక ప్రసాద్ , కాలనీ వాసులు రాఘవ రెడ్డి, ప్రవీణ్, శివ, కేశవ్ ప్రసాద్, జశ్వంత్, మధు, కృష్ణ రావు, లక్ష్మీపతి, సుమన్, జగదీష్, విశ్వనాథ్ , బుచ్చయ్య, గోపాల్ పాల్గొన్నారు.