నమస్తే శేరిలింగంపల్లి : భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం జయంతిని డిసిసి వైస్ ప్రెసిడెంట్ బొల్లంపల్లి విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలో నిర్వహించారు. అనంతరం బాబూ జగ్జీవన్ రాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ముఖ్యఅతిథిగా డిసిసి జనరల్ సెక్రెటరీ కొమరగోని సురేష్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ లీడర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గంగారం సంగారెడ్డి, ఆశిల శివ, కే లక్ష్మీనారాయణ, జామల్ పూర్ సాయినాథ్, సాయి వెంకట కిరణ్ పాల్గొన్నారు.