ఘ‌నంగా నిమ్మ‌ల ప్ర‌కాష్‌గౌడ్ ప‌టేల్ ప‌ద‌వి విర‌మ‌ణ వేడుక‌

హ‌ఫీజ్‌పేట్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హ‌ఫీజ్‌పేట్ గ్రామానికి చెందిన నిమ్మ‌ల ప్ర‌కాష్‌గౌడ్ ప‌టేల్ ప‌ద‌వీ విర‌మ‌ణ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. బిహెచ్ఈఎల్ 51వ బ్లాక్‌లో అడిష‌న‌ల్ ఇంజినీర్ (3వ గ్రేడ్ )‌గా విధులు నిర్వ‌హించిన ప్ర‌కాష్ గౌడ్ ప‌టేల్ శుక్ర‌వారం ప‌ద‌వి విర‌మ‌ణ పొందారు. ఈ సంద‌ర్భంగా భెల్ ఆఫీస‌ర్స్ ఆండ్ ఇంజ‌నీర్స్ కార్యాల‌యంలో ప్ర‌కాష్ గౌడ్ ప‌ద‌వీ వీర‌మ‌ణ వేడ‌క‌లు నిర్వ‌హించారు.

ప్ర‌కాష్‌గౌడ్ ప‌టేల్‌ను స‌న్మానిస్తున్న రాచ‌మ‌ళ్ల నాగేశ్వ‌ర్ గౌడ్‌, శ్రీనివాస్ గౌడ్‌, సాయిరాం గౌడ్‌లు

బిజెపి జిల్లా నాయ‌కులు రాచ‌మ‌ళ్ల నాగేశ్వ‌ర్ గౌడ్‌, ప్ర‌ముఖ వ్యాపారి రాచ‌మ‌ళ్ల శ్రీనివాస్ గౌడ్‌, చేగూరి బాల‌కృష్ణ మెమోరియ‌ల్ ట్ర‌స్ట్ చైర్మ‌న్ చేగూరి సాయిరాం గౌడ్‌లు‌ ప్ర‌కాష్‌గౌడ్‌ను ఘ‌నంగా స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ప్ర‌కాష్ గౌడ్ గ‌త 37 ఏళ్లుగా అంకిత‌బావంతో భెల్‌లో విధులు నిర్వ‌హించార‌ని, క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరుగా నిలిచార‌ని అన్నారు. భెల్‌లో ప‌నిచేసే యువ‌త ప్ర‌కాష్ గౌడ్‌ను ఆద‌ర్శంగా తీసుకువాల‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో తోటి ఉద్యోగులు, స్థానిక ప్ర‌ముఖులు, బంధువులు పెద్ద సంఖ్య‌లో పాల్గొని ప్ర‌కాష్‌గౌడ్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here