నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో సాంస్కృతిక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సుమధుర ఆర్ట్స్ అకాడమీ నుంచి శ్రావ్య మానస శిష్య బృందం కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టున్నాయి.
వీటిలో కూచిపూడి నృత్య ప్రదర్శనలో.. నారాయణ అచ్యుత , అన్నమయ్య సంకీర్తనలు, శ్రీ విఘ్న రాజాం భజే, దశావతారం, శివాష్టకం, ఏకదంతాయ, శ్రీమన్నారాయణ, కొలువైతివారంగా సాయి, భో శంభో, ధనశ్రీ తిల్లాన, కాదనకుతూహల తిల్లాన, గణేశా పంచరత్న – కూచిపూడి నృత్య ప్రదర్శనలో- మేడారం జాతర, గుజ్జరి, చందనలో మొదలైన అంశాలను నృత్య ప్రదర్శనలతో మెప్పించారు. కుండానే, అమూల్య, స్పందన, సాహితి, లీక్షిత, శాన్వి, తన్వి, శివ ప్రణీత ఇందులో పాల్గొన్నారు.