గొల్ల కురుమలకు అన్యాయం జరిగినందునే రాజీనామా

  • రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మంచిర్యాల జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ మాజీ చైర్మన్ డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో గొల్ల కురుమలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మంచిర్యాల జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ మాజీ చైర్మన్ డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.

హైదరాబాదులో జరిగిన తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమలకు రెండో విడుతలో గొర్రెలు పంపిణీ చేస్తామని చెప్పి.. 43750కు ఒక్క యూనిటీ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా రైతులు దాదాపుగా 75 వేల డిడిలు కట్టారని, కానీ అప్పుడు, ఇప్పుడు అంటూ పబ్బం గడుపుతూ 18 నెలలు గడిపి మభ్యపెట్టిందని వాపోయారు. ఫలితంగా గొల్ల కురుమలు అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గొల్ల కురుమలకు తగిన న్యాయం చేయనందున బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, రాష్ట్ర ముఖ్య సలహాదారి బేరి రామచందర్ యాదవ్, సలహాదారు గుడిగే శ్రీనివాస్ యాదవ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చిగుర్ల శ్రీనివాస్, భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షులు గజ్జి రమేష్ యాదవ్, వనపర్తి జిల్లా అధ్యక్షులు మధు యాదవ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఆవుల రాజన్న యాదవ్, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here