గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డిని నల్లగండ్ల గ్రామస్థులు గురువారం కలిశారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గచ్చిబౌలి డివిజన్ నుంచి తెరాస కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు స్థానిక నాయకుడు బొల్లంపల్లి సత్యనారాయణ రెడ్డికి అవకాశం కల్పించాలని కోరారు. ఈ మేరకు సత్యనారాయణ రెడ్డి మంత్రికి వినతిపత్రంతోపాటు తన బయోడేటాను అందజేశారు.

ఈ కార్యక్రమంలో నల్లగండ్ల నాయకులు బి వెంకట్ రెడ్డి, బి రాజి రెడ్డి, బి గోవర్ధన్ రెడ్డి, బి రఘుపతి రెడ్డి, బి బాల్ రెడ్డి, బి నరేందర్ రెడ్డి, బి అమరేందర్ రెడ్డి, పి రాజి రెడ్డి, పి మోహన్ రెడ్డి, పి కృష్ణ రెడ్డి, పి కొండల్ రెడ్డి, బద్ధం కొండల్ రెడ్డి, బి రాజేష్ రెడ్డి, బి నవీన్ రెడ్డి, తెరాస పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.





