- జహీరాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ గా బదిలీ ఉత్తర్వులు
నమస్తే శేరిలింగంపల్లి: జిహెచ్ఎంసి శేరిలింగంపల్లి సర్కిల్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న డి.సుభాష్ రావు జహీరాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ గా బదిలీపై వెళ్లనున్నారు. ఆయనతో పాటు మున్సిపల్ శాఖకు సంబంధించిన నలుగురు అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చందానగర్, శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలో కలిపి దాదాపు ఏడు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న సుభాష్ రావు బదిలీపై వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సుభాష్ రావు మాదిరిగానే గతంలో శేరిలింగంపల్లి సర్కిల్ లోనే ఏఎంసీలుగా పనిచేసిన ఆశ్రిత్ కుమార్ నర్సాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ గా, రాజేంద్ర కుమార్ చెర్యాల్ మున్సిపాలిటి కమిషనర్ గా బదిలీపై వెళ్లనుండటం విశేషం.