భారీ మెజారిటీతో గెలవడం ఖాయం

  • మాదాపూర్/కొండాపూర్ డివిజన్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్ చార్జి జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్ చార్జి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఖానమేట్ వద్ద మాదాపూర్/కొండాపూర్ డివిజన్ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్ చార్జి జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదం ఈసారి బలంగా ఉందని, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని మెజార్టీ సాధిస్తుందని అన్నారు. ఎంపీ గెలిస్తే మరింత అభివృద్ధి చేసుకొనే అవకాశం ఉందన్నారు.

మాదాపూర్/కొండాపూర్ డివిజన్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్ చార్జి జగదీశ్వర్ గౌడ్

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో సిటీకి ఆనుకొని ఉన్న శేరిలింగంపల్లి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తామని అన్నారు. అందుకు కార్యకర్తలు సిఫాయిల్లా పనిచేలాని కోరారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీని అందించడం ఖాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

సమావేశంలో పాల్గొన్న మాదాపూర్/కొండాపూర్ డివిజన్ ముఖ్యకార్యకర్తలు

ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ గౌస్, శేరిలింగంపల్లి కార్డినెటర్ రఘునందన్ రెడ్డి, మహిపల్ యాదవ్, టీపీసీసీ లేబర్ సెల్ చైర్మన్ నల్ల సంజీవ రెడ్డి, వైస్ చైర్మన్ బి.కృష్ణ ముదురాజ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వి.వీరేందర్ గౌడ్, నాగేశ్వరరావు, ఏకే బలరాజ్, డివిజన్ అధ్యక్షులు సురేష్ నాయక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజన్, నగేష్ నాయక్, గోపాల్ నాయక్, హున్య నాయక్, మహేష్, అశోక్, మునఫ్ ఖాన్, రహీం, ఖాజా, విల్సన్, మనికప్ప, డేవిడ్, సాజిద్, ఇస్మాయిల్, ప్రసాద్, అంజద్, నందు, గణేష్, రషీద్, హామీద, హనీఫ్, ముష్రాఫ్, ముక్తర్రాంబాబు, ప్రేమ కుమార్, నరేష్, మహిళ అధ్యక్షురాలు సారా ఖాన్, శశిరేఖ, శ్రీజ రెడ్డి, సితమ్మ, ప్రమీల, పర్వీన్, మంజుల పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here