ఉచిత ఎల్ ఆర్ ఎస్ హామీ ని అమలు చేయాలి

  • ఎమ్మెల్యే ఆరేకపుడి గాంధీ
  • జోనల్ కమిషన్ కి , శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ , తహసీల్దార్ కి వినతి పత్రం సమర్పణ 

నమస్తే శేరిలింగంపల్లి: ఎల్ ఆర్ ఎస్ ఉచితంగా చేస్తామని బూటకపు హామీ ఇచ్చి, ఇప్పుడు మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ నిరంకుశ, ద్వంద వైఖరిపై బి ఆర్ ఎస్ కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ పెద్ద నిరసన తెలిపారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ కార్యాలయం లో, శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ , తహసీల్దార్ కార్యలయంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్, దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి , మాజీ కార్పొరేటర్ సాయి బాబా, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు , నాయకులు,కార్యకర్తలతో కలిసి జోనల్ కమిషన్ కి , శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ , తహసీల్దార్ కి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా ప్రజల్ని మోసం చేస్తూ ఎల్ఆర్ఎస్ కి డబ్బులు వసూలు చేస్తుందని.. దీనికి నిరసనగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం, మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జోనల్ కారయాలయంలో మండల తహసీల్దార్ కార్యలయంలో LRS ఫీజులు వసూలు చేయకుండా ఉచితంగా LRS చేయాలని వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు ప్రజల పక్షాన పోరాడుతుందని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.

గత ఎన్నికలలో బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు పరచకుండా ప్రజలను మోసం చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎల్.ఆర్. ఎస్ ను ఉచితంగా అమలు చేస్తానని చెప్పి ప్రజలను మభ్య పెట్టిందని, కాని అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లోనే ఆదాయ మార్గాలపై దృష్టిపెట్టి ప్రజల నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని మంది పడ్డారు. గతంలో ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులు చేసుకున్న వారికీ రెగ్యూలరైజేషన్ చేసే విషయాన్ని పరీక్షించకుండా దాని పైన ఎలాంటి నిర్ణయం చెప్పకుండా ఇప్పుడు కొత్తగా ఎల్.ఆర్.ఎస్ పథకాన్ని ప్రవేశ పెట్టడం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయ మార్గం పెంచుకోవడమే కనబడుతుందని దుయ్యబట్టారు.

గతం లో దరఖాస్తు చేసుకున్న ఎల్.ఆర్.ఎస్ పథకాన్ని పరీక్షిస్తూ కొత్తగా ఇప్పుడు ప్రవేశ పెట్టిన ఎల్.ఆర్.ఎస్ పథకం వారు ఇచ్చిన హామీల ప్రకారం ఉచితంగా మంజూరి ఇవ్వాల్సిందిగా తెలిపారు. ఈ ఎల్ ఆర్ ఎస్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే దరఖాస్తు పెట్టుకున్న 25 లక్షల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, వారిపై పడే సుమారు 20 వేల కోట్ల రూపాయల భారాన్ని తప్పించేలా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు అప్పటిదాకా ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుదారులకు ఫోన్లు చేయడం వంటి పద్ధతుల ద్వారా ఫీజులు కట్టమని ప్రభుత్వాధికారులు ఒత్తిడి చేయకుండా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళ సోదరీమణులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here