శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించి ఇటీవల బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల కవితకి శేరిలింగంపల్లి టిఆర్ఎస్ నాయకుడు గుర్ల తిరుమలేష్ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో కవితను మర్యాదపూర్వకంగా కలిసిన తిరుమలేష్ పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. కల్వకుంట్ల కవిత భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.






