జాబ్ మేళాలతో నిరుద్యోగ యువతకు ఎంతో మేలు: ఎంపీ రంజిత్ రెడ్డి

ఈ నెల 11 న హోప్ ఫౌండేషన్ అద్వర్యం లో మెగా జాబ్ మేళా


సమావేశంలో జాబ్ మేళా వివరాలు వెల్లడిస్తున్న ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, చిత్రంలో ప్రభుత్వ విప్ గాంధీ, ఎమ్మెల్సీ నవీన్ రావు, కొండా విజయ్ కుమార్ లు ఉన్నారు.

మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన యువతకు జాబ్ మేళాలతో మేలు చేకూరుతుందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. హోప్ ఫౌండేషన్ సహకారంతో హెచ్ వైఎస్ఈ ప్లేసెమెంట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 11 వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నరు. ఈ జాబ్ మేళాకు సంబందించిన వివరాలను గురువారం మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ రంజిత్ రెడ్డి ప్రభుత్వ విప్ గాంధీ, ఎమ్మెల్సీ నవీన్ రావు, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ తో కలిసి వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11 వ తేదీన నల్లగండ్ల రవీందర్ రెడ్డి గార్డెన్ లో నిర్వహించే జాబ్ మేళాలో వంద కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. మేళాలో అర్హత కలిగిన దాదాపు వెయ్యికి పైగా నిరుద్యోగులకు అక్కడికక్కడే ఉద్యోగ నియామక పత్రాలు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. మరో పదివేల మందికి ఆన్లైన్ ద్వారా శిక్షణ అందించి ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ మేళాను సమీప ప్రాంతాల నిరుద్యోగులు సద్వినియోగ చేసుకోవాలని వారు సూచించారు. మేళా నిర్వహించడానికి ప్రత్యేక కృషి చేస్తున్న హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ను ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గాంధీ, ఎమ్మెల్సీ నవీన్ రావు లు అభినందించారు. మరిన్ని వివరాలకు www. Hyseplacements.com, 8151963810 సంప్రదించవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశంలో హెచ్ వైఎస్ఈ సంస్థ సీఈఓ మనీష్, హోప్ సంస్థ సభ్యులు రెడ్డి ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here