- నిందితుడిన అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు
నమస్తే శేరిలింగంపల్లి : ప్లాట్లను ఆక్రమించి బెదిరింపులకు పాల్పడుతున్న నిందితుడిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం.. శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట వద్ద బాలమ్రాయ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ లో 1994 సంవత్సరంలో ఓ మహిళా నం. 4పి, 5పీ, 6పీలలో 500 చదరపు గజాలు (మొత్తం 1000 చదరపు గజాలు) 61 & 61A కలిగిన రెండు ప్లాట్లను కొనుగోలు చేశారు. అయితే ఆమె అమెరికాలో ఉండగా.. ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్ ఆ రెండు ప్లాట్లను ఆక్రమించి ‘రాజు క్రికెట్ అకాడమీ’ తోపాటు చెత్తను వేసి గుడిసెలు వేసుకున్నాడు. అయితే ఆమె ప్లాట్లు ఖాళీ చేయమని చెప్తే రూ. 5 కోట్లు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడసాగాడు. దీంతో ఆమె మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని 6వ తేదీన అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కోసం న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.