నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో పెండింగులో ఉన్న మంజీర పైప్ లైన్ , అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను మంజూరు చేయాలని, మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ నూతన పనులు, హాఫీజ్ పెట్ ఫ్లైఓవర్ నుంచి హుడా కాలనీ వరకు మంజీర రోడ్డులో చేపట్టిన పైప్ లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరుతూ హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్.బి ఎం.డి సుదర్శన్ రెడ్డి ని శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ కలిసి వినతిపత్రాన్ని అందించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తూ, మౌలిక వసతులు కల్పనకు పెద్దపీట వేస్తామని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా, ప్రజలకు సౌకర్యవంతమైన, మెరుగైన జీవన విధానాన్ని, సౌకర్యం కల్పించడం కోసం తమ శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. మియాపూర్, హాఫీజ్ పేట్, మాదాపూర్, గచ్చిబౌలి, అల్విన్ కాలనీ, వివేకానంద నగర్, హైదరనగర్, కూకట్ పల్లి, లింగంపల్లి, కొండాపూర్ డివిజన్ పరిధిలో నూతన పనులకు ఎస్టిమేషన్లు సిద్ధం చేసేలా అధికారులను ఆదేశించాలని సుదర్శన్ రెడ్డిని కోరారు.