ఆస్తి పన్ను వసూళ్లలో జోరు పెంచాలి

  • సమీక్షా సమావేశంలో జోనల్ కమీషనర్ స్నేహ శబరిశ్ 

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండలం పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లపై జోనల్‌ కమిషనర్‌ స్నేహా శబరీష్‌ ఐఏఎస్‌ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు, ఏఎంసిల టాక్స్ ఇన్‌స్పెక్టర్లు & బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.

ఆస్తి పన్ను వసూళ్లపై సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న జోనల్‌ కమిషనర్‌ స్నేహా శబరీష్‌ ఐఏఎస్‌

ఈ సందర్భంగా జోనల్ కమీషనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్తుల ఆస్తి పన్ను వసూళ్లను పెంచాలని, అందుకనుగుణంగా ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు. లక్ష్యాన్ని ఛేదించేందుకు పకడ్బందీగా ముందుకు కదలాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో 19, 20, 21, 22 సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు సేవా ఎస్లావత్, రజనీకాంత్, వంశీ, సురేష్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here