ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

నమస్తే శేరిలింగంపల్లి : జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ మాధవరెడ్డి ఆధ్వర్యంలో ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి.

జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల పోస్టర్ ఆవిష్కరిస్తున్న శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి మాధవ రెడ్డి

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వారోత్సవాలు మార్చ్ 8వ తేదీ నుండి మార్చ్ 14వ తేదీ వరకు కొనసాగుతాయని, నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి డివిజన్లో సేవ కార్యక్రమాలు నుండి ప్రజల పక్షాన వాళ్ళ సమస్యలను తెలుసుకుని ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వివిధ డివిజన్ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, జన సైనికులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here