- మాదాపూర్ లోని ఆదిత్య నగర్ లో పర్యటన
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకకర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కాలనీలో రూ. 43 లక్షల అంచనావ్యయం తో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను అక్కడ పర్యటించి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఆదిత్య నగర్ కాలనీ దశదిశను మార్చామని, ఆదిత్య నగర్ కాలనీను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తి చేస్తామని, కాలనీలో జరుగుతున్న రోడ్డు పనుల నాణ్యత ప్రమాణాలను పరిశీలించామని తెలిపారు. మాదాపూర్ డివిజన్ లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యం కోసం శాయశక్తుల కృషి చేస్తానని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ఎమ్మెల్యే గాంధీ హామీ ఇచ్చారు.
ఈద్గా ను పరిశీలించి, ఈద్గా అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లవేళలో ఉంటాయని, ఈద్గా అభివృద్ధికి కృషి చేస్తానని, త్వరలోనే పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు ఏఈ ప్రశాంత్, జలమండలి డీజీఎం శరత్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాంబశివరావు, బాబు మియా, ఖాసీం, లియాకత్, సలీం, బాబు మియా, మియాన్ పటేల్, బృందరావు, రాములు, కాజా, షోయబ్, నర్సింహ, బుజ్జి, నర్సింహ, బుజ్జమ్మ, కాలనీవాసులు పాల్గొన్నారు.