- శేరిలింగంపల్లి నియోజకవర్గ హైదరనగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్ కాలనీలో పర్యటించిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్
- స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలిపిన కాలనీవాసులు
నమస్తే శేరిలింగంపల్లి : హైదరనగర్ డివిజన్ పరిధిలోని గౌతమి నగర్ కాలనీలో స్థానికంగా నెలకొన్న సమస్యలను స్థానిక కాలనీ వాసులు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ దృష్టికి తీసుకు వచ్చారు. స్థానికంగా ఆనుకుని 80 అడుగుల లోతు సెల్లార్ తీయడం వలన రోడ్డు, డ్రైనేజ్ వ్యవస్థ కృంగిపోయిందని, కాలనీవాసుల బతుకు దినదిన గండంగా మారిందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. యుద్ధప్రాతిపదికన అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమస్యను పరిష్కరించాలని జి.హెచ్.ఎం.సి కమీషనర్, జోనల్ కమీషనర్ ఇతర అధికారులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు, కూన సత్యం గౌడ్, కొడాలి రవి, కావూరి ప్రసాద్, శ్రీకాంత్, సాద మహేష్, రాజిరెడ్డి, మురళి, మోహన్ రెడ్డి, పరుచూరి వెంకటేశ్వర రావు, కొఠారి వెంకటేష్, మనేపల్లి సాంబశివరావు, రవి, శ్యామ్, వేమూరి సాంబశివరావు, గౌతమి నగర్ కాలని వాసులు కుమారస్వామి, కృష్ణకాంత్, పరుచూరి గణేశ్ పాల్గొన్నారు.