- శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందనగర్ భవనిపురం బస్తీలో పర్యటించిన స్థానికంగా ఉన్న సమస్యలపై స్థానిక బస్తి సభ్యులతో కలిసి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల పాలనకు నిదర్శనం, కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం శ్రీ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని, రంగారెడ్డి జిల్లా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు దృష్టికి ప్రతి సమస్యను తీసుకువెళ్లి పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఇళ్ల పట్టాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ, నీటి, సీసీ రోడ్డు సమస్యలు స్థానికులు శేరిలింగంపల్లి ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలు ప్రతి ఒక్కటి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రజల మధ్యనే ఉంటూ మీ సమస్యలను ఒక్కొక్కటిగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సునీత రెడ్డి, శేరిలింగంపల్లి నాయకులు ప్రభాకర్ రెడ్డి, గఫుర్, చందర్ రావు, పొచ్చన్న, సైఫుల్లాహ్ ఖాన్, వేణు, రాము, ఆయాజ్ ఖాన్, శ్రీకాంత్, అనిల్ కుమార్, పాపయ్య, పోచయ్య, మల్లేష్, రమేష్, నర్సింహ, శ్యామ్, ఆఫ్రోజ్, రాజ్ కుమార్, మహిళ నాయకురాలు లలిత రాణి, సరితా, బుజమ్మ, శ్రావణి పాల్గొన్నారు.